ఆరడగుల దూరం పాటించకుంటే జరిమానా!

దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఇంటికి చెందని ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించకపోతే 3500 అమెరికన్ డాలర్ల జరిమానా విధించనున్నట్లు కెనడాలోని టొరంటో ప్రభుత్వం ప్రకటించింది. పార్కుల్లో గానీ, పబ్లిక్ ప్రాంతాల్లో గానీ ఎలాంటి బంధంలేని ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని సూచించింది. కొవిడ్ 19 వైరస్ అదుపు చేయడంలో భాగంగా టొరంటో ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆదేశంలో పేర్కొంది. సోషల్ […]

Update: 2020-04-03 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఇంటికి చెందని ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించకపోతే 3500 అమెరికన్ డాలర్ల జరిమానా విధించనున్నట్లు కెనడాలోని టొరంటో ప్రభుత్వం ప్రకటించింది. పార్కుల్లో గానీ, పబ్లిక్ ప్రాంతాల్లో గానీ ఎలాంటి బంధంలేని ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని సూచించింది.

కొవిడ్ 19 వైరస్ అదుపు చేయడంలో భాగంగా టొరంటో ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆదేశంలో పేర్కొంది. సోషల్ లేదా ఫిజికల్ డిస్టాన్సింగ్ పాటించడంలో కెనడియన్లు నిర్లక్ష్యం పాటిస్తున్న నేపథ్యంలో ఈ మేరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం నాటికి కెనడాలో 10,466 మందికి కరోనా సోకినట్లు చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టామ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 111 మరణాలు సంభవించినట్లు తెలిపారు.

Tags : COVID 19, Corona, Canada, toronto, social distance, physical distance

Tags:    

Similar News