ఫాహద్.. ఫస్ట్ ఓటీటీ సూపర్ స్టార్

దిశ, సినిమా: ఫాహద్ ఫాజిల్.. ఓటీటీ సూపర్ స్టార్‌గా నిలిచాడు. వచ్చే గురువారం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘మాలిక్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుండగా.. వన్ ఇయర్‌ డ్యురేషన్‌లో డిజిటల్ స్పేస్‌లో నాలుగు సినిమాలు విడుదల చేసిన బ్లాక్ బస్టర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సెప్టెంబర్ 2020లో ‘సీ యూ సూన్‌’తో ఓటీటీ జర్నీ స్టార్ట్ చేసిన ఫాహద్.. ‘ఇరుల్, జోజి, మాలిక్’ ద్వారా లాక్ డౌన్‌లోనూ నాలుగు హిట్ సినిమాలు రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా […]

Update: 2021-07-10 08:12 GMT

దిశ, సినిమా: ఫాహద్ ఫాజిల్.. ఓటీటీ సూపర్ స్టార్‌గా నిలిచాడు. వచ్చే గురువారం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘మాలిక్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుండగా.. వన్ ఇయర్‌ డ్యురేషన్‌లో డిజిటల్ స్పేస్‌లో నాలుగు సినిమాలు విడుదల చేసిన బ్లాక్ బస్టర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సెప్టెంబర్ 2020లో ‘సీ యూ సూన్‌’తో ఓటీటీ జర్నీ స్టార్ట్ చేసిన ఫాహద్.. ‘ఇరుల్, జోజి, మాలిక్’ ద్వారా లాక్ డౌన్‌లోనూ నాలుగు హిట్ సినిమాలు రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. హోమ్ ఇండస్ట్రీ కేరళతో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ అభిమానులను కలిగి ఉన్న ఆయన.. గతేడాది కాలంలో మాత్రం మేజర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘కుంబలంగి నైట్స్, ట్రాన్స్, బెంగళూర్ డేస్’ లాంటి సినిమాలు చూసిన ఆడియన్స్.. కచ్చితంగా తన తదుపరి చిత్రాల కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందుకే ఆయన లాక్‌డౌన్‌లో రిలీజ్ చేసిన చిత్రాలకు భారీ డిమాండ్ లభించిందని, ఈ కారణంగానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి మెయిన్ ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఆయన చిత్రాల కోసం పోటీ పడుతున్నాయని అంటున్నారు.

ఓటీటీ స్పేస్ కొత్తదనాన్ని కోరుకుంటూ రోజురోజుకూ అభివృద్ధి చెందుతునడంలో అతిశయోక్తి లేదు. నార్త్‌లో మనోజ్ బాజ్‌పాయ్‌, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి లాంటి నటులు ఓటీటీ వల్లనే సూపర్ స్టార్స్‌గా ఎదగగా.. సౌత్‌లో ఫాహద్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు థియేటర్స్‌ వెలుపల కూడా అభిమానులను సంపాదించుకోగలిగాడు. నిజం చెప్పాలంటే ఇండియాలో ఓటీటీ స్థలాన్ని గొప్పగా వాడుకున్న మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్ అని చెప్పడంలో సందేహం లేదు. కొవిడ్ ఫస్ట్ వేవ్‌కు ముందు దర్శకుడు మహేష్ నారాయణ్‌తో కలిసి ఇ- థ్రిల్లర్ ‘సీ యూ సూన్’ వర్క్ స్టార్ట్ చేసిన ఫాహద్.. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయగానే చాలా తక్కువ సమయంలో ‘జోజి, ఇరుల్’ చిత్రాలను పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేశాడు.

ప్రభాస్, యశ్‌లాంటి పాన్ ఇండియా స్టార్స్ ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాలను ఇతర భాషల్లోకి డబ్‌చేసి స్టార్‌డమ్ పెంచుకుంటుంటే.. ఫాహద్ మాత్రం చాలా సింపుల్‌గా కేవలం తన మలయాళం మూవీ సబ్ టైటిల్స్‌తో ఇతర రాష్ట్రాలకు చెందిన అభిమానులను సంపాదిస్తుండటం విశేషం. తను సినిమాలో ఉంటే‌చాలు, స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని మేకర్స్ కూడా భావిస్తున్నారు. అందుకే ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశారనడంలో సందేహం లేదు. అందుకే ప్రతీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఆయన సినిమాలు తమ లైబ్రరీలో ఉండాలని కోరుకుంటున్నాయి. వాస్తవానికి ఓటీటీ కంటెంట్.. నిర్దిష్ట రాష్ట్రానికి సంబంధించినదిగా కాకుండా అంతర్జాతీయంగా ప్రభావితం చేయగలిగేలా ఉండాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాహద్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లాంటి ప్లా్ట్‌ఫామ్స్ ఫాహద్ మూవీస్‌ రైట్స్ పొందేందుకు ముందు వరుసలో ఉంటున్నాయంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News