మమ్మీ పోట్రెయిట్స్‌తో సరిపోలిన ఫేసియల్ రీకన్‌స్ట్రక్షన్

దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్టు మమ్మీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి మీద పరిశోధకులు నిత్యం ఏవేవో అధ్యయనాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ బాలుడి శవపేటిక మీద పరిశోధకులకు తాజాగా ‘మమ్మీ పోట్రెయిట్’ ఒకటి దొరికింది. దీని ఆధారంగా సిటీ స్కాన్‌తో ఆ ముఖాలు నిజమో కాదో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. గ్రీకో-రోమన్ కాలంలోని ఈజిప్షియన్లు ‘మమ్మీ పోట్రెయిట్’ సంప్రదాయాన్ని కొనసాగించారు. మమ్మీఫికేషన్ పూర్తయిన తర్వాత.. బాడీని క్రిస్‌క్రాస్డ్ […]

Update: 2020-09-22 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్టు మమ్మీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి మీద పరిశోధకులు నిత్యం ఏవేవో అధ్యయనాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ బాలుడి శవపేటిక మీద పరిశోధకులకు తాజాగా ‘మమ్మీ పోట్రెయిట్’ ఒకటి దొరికింది. దీని ఆధారంగా సిటీ స్కాన్‌తో ఆ ముఖాలు నిజమో కాదో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు.

గ్రీకో-రోమన్ కాలంలోని ఈజిప్షియన్లు ‘మమ్మీ పోట్రెయిట్’ సంప్రదాయాన్ని కొనసాగించారు. మమ్మీఫికేషన్ పూర్తయిన తర్వాత.. బాడీని క్రిస్‌క్రాస్డ్ లినెన్ బైండింగ్స్‌లో పెట్టి, ఆ శవపేటిక ముందు భాగంలో అతడి ముఖాన్ని చిత్రీకరిస్తారు. వీటిని ‘మమ్మీ పోట్రెయిట్’ అని పిలుస్తారు. మరి నిజంగానే ఆ ముఖాలు.. ఆ చనిపోయిన వ్యక్తులవేనా? లేదా? అని తెలుసుకునేందుకు ఆస్ట్రియా, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది.

వేలాది సంవత్సరాల క్రితం మరణించిన బాలుడి మృతదేహాన్ని సిటీ స్కాన్ చేసి.. అతడి ముఖాన్ని 3డీ డిజిటల్ రీకన్‌స్ట్రక్షన్ సాయంతో గీశారు. అతడి శవపేటిక మీదున్న పోట్రెయిట్.. శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ సాయంతో వేసిన పెయింటిగ్స్ రెండు సిమిలర్‌గానే ఉన్నాయి. కానీ, ఆ బాలుడు చనిపోయినప్పటి కన్నా 3-4 సంవత్సరాల ఎక్కువ వయసున్నప్పుడు ఎలా ఉంటాడో ఆ శవపేటికపై అలా గీశారు. మరి ఉన్న వయసు కంటే కాస్త ఎక్కువ వయసుతో ఉన్న పెయింటింగ్స్ వేయించడం వెనక ఉన్న మర్మమేమిటో పరిశోధకులకు అంతుచిక్కలేదు. అయితే, మమ్మీఫికేషన్‌కు ముందు ఆ బాలుడి మెదడు, అబ్డోనిమల్ ఆర్గాన్స్‌ను రిమూవ్ చేసినట్లు తెలిసింది. ఎముకలు, పళ్ల ఆధారంగా.. అతడు న్యూమోనియాతో చనిపోయి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News