ఫార్వర్డ్ మెసేజ్‌లపై పరిమితి విధిస్తున్న ఫేస్‌బుక్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాండమిక్ ఒక ఇన్ఫోడెమిక్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్‌ల మీద పరిమితి విధించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఒక మెసేజ్‌ని పరిమితిలో సూచించిన యూజర్ల మేరకే ఫార్వర్డ్ చేసే అవకాశం కలుగుతుంది. దీంతో ఎక్కువ మందికి తప్పుడు సమాచారం చేరకుండా అడ్డుకోవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తున్నట్లు ఆ సంస్థ కమ్యూనికేషన్స్ మేనేజర్ అలెగ్జాండ్రూ వొయికా ట్విట్టర్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాండమిక్ ఒక ఇన్ఫోడెమిక్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్‌ల మీద పరిమితి విధించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఒక మెసేజ్‌ని పరిమితిలో సూచించిన యూజర్ల మేరకే ఫార్వర్డ్ చేసే అవకాశం కలుగుతుంది. దీంతో ఎక్కువ మందికి తప్పుడు సమాచారం చేరకుండా అడ్డుకోవచ్చు.
అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తున్నట్లు ఆ సంస్థ కమ్యూనికేషన్స్ మేనేజర్ అలెగ్జాండ్రూ వొయికా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా కేవలం ఐదుగురికి మాత్రమే మెసేజ్ ఫార్వర్డ్ చేయొచ్చని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఫేస్‌బుక్ సంస్థ వారి వాట్సాప్‌లో ఉండటం గమనార్హం.
Tags – Facebook, forward messages, limit