వాట్సాప్ వెబ్‌లో మెసెంజర్ రూమ్ షార్ట్‌కట్
జనాల మధ్య భౌతిక దూరం పెరిగి, వర్చువల్ దూరం తగ్గుతున్న క్రమంలో వీడియో కాల్స్, వర్చువల్ మీటింగ్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. అందుకే జూమ్, గూగుల్ మీట్‌లకు పోటీగా ఫేస్‌బుక్ సంస్థ ‘మెసెంజర్ రూమ్స్’ యాప్‌ను తీసుకొచ్చింది. దీన్ని పాపులర్ చేయడానికి వాట్సాప్‌తో కూడా అనుసంధానం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో మెసెంజర్ రూమ్ షార్ట్‌కట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల నేరుగా వాట్సాప్ నుంచే మెసెంజర్ రూమ్‌కు […]
జనాల మధ్య భౌతిక దూరం పెరిగి, వర్చువల్ దూరం తగ్గుతున్న క్రమంలో వీడియో కాల్స్, వర్చువల్ మీటింగ్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. అందుకే జూమ్, గూగుల్ మీట్‌లకు పోటీగా ఫేస్‌బుక్ సంస్థ ‘మెసెంజర్ రూమ్స్’ యాప్‌ను తీసుకొచ్చింది. దీన్ని పాపులర్ చేయడానికి వాట్సాప్‌తో కూడా అనుసంధానం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో మెసెంజర్ రూమ్ షార్ట్‌కట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల నేరుగా వాట్సాప్ నుంచే మెసెంజర్ రూమ్‌కు కనెక్ట్ అయ్యే అవకాశం కలిగింది. తద్వారా వాట్సాప్‌లో చాట్ చేస్తూ వెంటనే మీటింగ్ పెట్టుకోవాలనుకున్న వారు ఈ షార్ట్‌కట్‌ను ఉపయోగించుకోవచ్చు.
వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్లలో ‘క్రియేట్ ఎ రూమ్’ అని కనిపిస్తుంది. అలాగే ఏదైనా కాంటాక్ట్‌తో చాటింగ్ చేస్తున్నపుడు ఫైల్ జోడించే ఆప్షన్ వద్ద కూడా రూమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వెంటనే ఒక లింక్ మీ మెసెంజర్ రూమ్స్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ దాదాపు 50 మందితో వీడియో కాల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాప్ వెర్షన్‌కు తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లను సమన్వయ మిళితం చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్ ఇలా ఆప్షన్లను అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై లభ్యమయ్యేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.