Facebook : ఫేస్‌బుక్ మరో సంచలనం.. షాక్‌లో యూజర్స్
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్ మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల ఫేస్‌బుక్‌పై వ్యక్తిగత గోప్యత వివరాలు, డేటా లీక్ వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్ యాప్ నుంచి ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్‌ను తొలిగిస్తున్నట్టు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్ ప్రింటర్ల ఆప్షన్‌ను కూడా తొలగిస్తున్నట్టు తెలిపింది. ఇదిలాఉండగా, ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్‌ను 2010లో ఫేస్‌బుక్ తీసుకొచ్చింది. ప్రస్తుతం FB యూజర్స్‌లో మూడొంతుల […]
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్ మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల ఫేస్‌బుక్‌పై వ్యక్తిగత గోప్యత వివరాలు, డేటా లీక్ వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్ యాప్ నుంచి ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్‌ను తొలిగిస్తున్నట్టు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది.
అంతేకాకుండా ఫేస్ ప్రింటర్ల ఆప్షన్‌ను కూడా తొలగిస్తున్నట్టు తెలిపింది. ఇదిలాఉండగా, ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్‌ను 2010లో ఫేస్‌బుక్ తీసుకొచ్చింది. ప్రస్తుతం FB యూజర్స్‌లో మూడొంతుల మంది ఈ టెక్నాలజీని వాడుతున్నట్టుగా మెటా ప్రకటించింది. ఈ సాంకేతికతను రిమూవ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో యూజర్స్ నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది.