సొంత ఆన్‌లైన్ గేమింగ్ యాప్ విడుదల చేసిన ఫేస్‌బుక్

దిశ, వెబ్‌డెస్క్: చూడబోతే సోషల్ మీడియా రంగానికి సంబంధించి అన్నింటిలో తన గుర్తింపు చాటుకోవాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్నట్టుంది. ఒక్యులస్ సంస్థను చేజిక్కించుకుంటున్న నాటి నుంచి గేమింగ్ రంగంలో అడుగుపెట్టడానికి ఫేస్‌బుక్ పనులు ప్రారంభించింది. ఎట్టకేలకు ఫేస్‌బుక్ గేమింగ్ యాప్‌ని సోమవారం విడుదల చేసింది. యూట్యూబ్ గేమింగ్, ట్విచ్, మిక్సర్ వంటి యాప్‌లు వాడుతున్న యూజర్లు అందరినీ ఈ యాప్‌తో ఫేస్‌బుక్ తన వైపు తిప్పుకోబోతుంది. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ఆడటమే కాకుండా, కావాలనుకుంటే ఒక్క […]

Update: 2020-04-21 01:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: చూడబోతే సోషల్ మీడియా రంగానికి సంబంధించి అన్నింటిలో తన గుర్తింపు చాటుకోవాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్నట్టుంది. ఒక్యులస్ సంస్థను చేజిక్కించుకుంటున్న నాటి నుంచి గేమింగ్ రంగంలో అడుగుపెట్టడానికి ఫేస్‌బుక్ పనులు ప్రారంభించింది. ఎట్టకేలకు ఫేస్‌బుక్ గేమింగ్ యాప్‌ని సోమవారం విడుదల చేసింది. యూట్యూబ్ గేమింగ్, ట్విచ్, మిక్సర్ వంటి యాప్‌లు వాడుతున్న యూజర్లు అందరినీ ఈ యాప్‌తో ఫేస్‌బుక్ తన వైపు తిప్పుకోబోతుంది.

ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ఆడటమే కాకుండా, కావాలనుకుంటే ఒక్క బటన్‌తో స్ట్రీమింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫేవరెట్ గేమర్లు ఆడుతున్న ఆటను వీక్షించొచ్చు. అలాగే చాట్ చేయడం, గ్రూపులు కూడా చేసుకోవచ్చు. 18 నెలల పాటు లాటిన్ అమెరికా దేశాల్లో ఈ యాప్ బీటా టెస్టింగ్ చేసి ఈ యాప్‌ని విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్, త్వరలో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. నిజానికి జూన్ విడుదల కావాల్సిన ఈ యాప్, క్వారంటైన్, లాక్‌డౌన్ కారణంగా ముందే విడుదల చేశారు.

Tags: facebook, Online game, android, iphone, youtube, twitch, mixer

Tags:    

Similar News