ఒక్క రోజులో 7 బిలియన్లు నష్టపోయిన ఫేస్‌బుక్!

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 7.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఫేస్‌బుక్ ఐఎన్‌సీ, దాని అనుబంధ సంస్థల్లో ప్రకటనలు ఇవ్వబోమని వ్యాపారసంస్థలు ప్రకటించడంతో ఆ కంపెనీ ఇంతలా నష్టపోయింది. అంతేకాకుండా కంపెనీ షేర్లు శుక్రవారం 8.3 శాతం పడిపోయాయి. తప్పుడు సమాచారాన్ని, ద్వేషపూరిత పోస్టులను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందన్న నెపంతో వ్యాపారసంస్థలు ప్రకటనలు ఇవ్వడాన్ని విరమించుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచంలో వాణిజ్య ప్రకటనలు అధికంగా ఇచ్చే యూనీలివర్ సంస్థ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు […]

Update: 2020-06-27 05:39 GMT

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 7.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఫేస్‌బుక్ ఐఎన్‌సీ, దాని అనుబంధ సంస్థల్లో ప్రకటనలు ఇవ్వబోమని వ్యాపారసంస్థలు ప్రకటించడంతో ఆ కంపెనీ ఇంతలా నష్టపోయింది. అంతేకాకుండా కంపెనీ షేర్లు శుక్రవారం 8.3 శాతం పడిపోయాయి. తప్పుడు సమాచారాన్ని, ద్వేషపూరిత పోస్టులను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందన్న నెపంతో వ్యాపారసంస్థలు ప్రకటనలు ఇవ్వడాన్ని విరమించుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచంలో వాణిజ్య ప్రకటనలు అధికంగా ఇచ్చే యూనీలివర్ సంస్థ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో ఇంత మొత్తంలో నష్టపోయినట్లు తెలుస్తోంది.

యూనీలివర్ సంస్థ కంటే ముందు వెరిజాన్ కమ్యూనికేషన్స్, హెర్షీ కో. సంస్థలు ప్రకటనలు ఇవ్వబోమని తెలిపాయి. కోకా కోలా సంస్థ కూడా కనీసం 30 రోజులు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచార ప్రకటనలు ఇవ్వబోమని వెల్లడించింది. దీని గురించి మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. తప్పుడు సమాచారాన్ని, ద్వేషపూరిత అభిప్రాయాలను ఫేస్‌బుక్ ఎన్నటికీ సహించబోదని హామీ ఇచ్చారు. ఇక నుంచి ఎన్నికల ఆధారిత పోస్టులకు, తప్పుడు సమాచార పోస్టులకు లేబులింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను విస్మరించేది లేదని.. తప్పుడు సమాచారం అనిపిస్తే ఎవరి పోస్టునైనా లేబులింగ్ చేసేందుకు ఫేస్‌బుక్ సిద్ధంగా ఉందని మార్క్ వివరించారు.

Tags:    

Similar News