యాప్‌లోనూ డార్క్‌మోడ్.. ప్రయత్నాల్లో ఫేస్‌బుక్
ఇటీవల దాదాపు ప్రతి యాప్ డార్క్‌మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వినియోగదారుని కళ్లకు తక్కువ అలసట కలిగేలా చేసేందుకు ఈ డార్క్‌మోడ్ ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా ఇప్పటికే తమ డెస్క్‌టాప్ యాప్‌లో డార్క్‌మోడ్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యాప్‌లోనూ డార్క్‌మోడ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రాం, మెస్సెంజర్, ఇంకా ఫేస్‌బుక్ లైట్ వెర్షన్ యాప్‌లలో డార్క్‌మోడ్ అందుబాటులో ఉంది. కానీ ప్రధాన ఫేస్‌బుక్ యాప్‌లో ఇది లేకపోవడం పట్ల […]
ఇటీవల దాదాపు ప్రతి యాప్ డార్క్‌మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వినియోగదారుని కళ్లకు తక్కువ అలసట కలిగేలా చేసేందుకు ఈ డార్క్‌మోడ్ ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా ఇప్పటికే తమ డెస్క్‌టాప్ యాప్‌లో డార్క్‌మోడ్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యాప్‌లోనూ డార్క్‌మోడ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రాం, మెస్సెంజర్, ఇంకా ఫేస్‌బుక్ లైట్ వెర్షన్ యాప్‌లలో డార్క్‌మోడ్ అందుబాటులో ఉంది. కానీ ప్రధాన ఫేస్‌బుక్ యాప్‌లో ఇది లేకపోవడం పట్ల చాలా మంది విమర్శించారు.
ఈ నేపథ్యంలో డార్క్‌మోడ్ ఫీచర్‌తో పాటు కరోనా వైరస్ ట్రాకర్ సదుపాయాన్ని కూడా అందించనున్నట్లు సమాచారం. ఇక కరోనా వైరస్‌తో కలిసి జీవించేందుకు ప్రపంచమంతా సిద్ధమైన నేపథ్యంలో దీని ట్రాకర్‌ను పూర్తిస్థాయిలో శాశ్వతంగా ప్రవేశపెట్టాలని ఫేస్‌బుక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో గత మూడు వారాల్లో నమోదైనా కేసుల వివరాలు, దేశాలవారీగా గత వారం రోజుల్లో నమోదైన కేసులతో పాటు కొవిడ్ 19 పాజిటివ్ కేసుల లొకేషన్ కూడా చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని అమెరికాలో ముందుగా ప్రవేశపెట్టి తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిప్లాయ్ చేయనున్నట్లు 9టు5గూగుల్ వెబ్‌సైట్ పేర్కొంది.