క్లబ్‌హౌజ్‌కు పోటీగా ఎఫ్‌‌బీ ‘లైవ్ ఆడియో రూమ్స్, సౌండ్ బైట్స్’

దిశ, ఫీచర్స్: ఆడియో చాట్ యాప్ ‘క్లబ్‌హౌజ్’ పాపులారిటీ క్రమంగా పెరుగుతుందని ఇది వరకే చెప్పుకున్నాం. ఇండియాలోనూ దీని డౌన్‌లోడ్స్ పెరగడంతో ట్విట్టర్ కూడా ‘స్పేసెస్’ అనే ఆడియో చాట్ కన్వర్జేషన్స్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘లైవ్ ఆడియో రూమ్స్’ అనే కొత్త ఫీచర్‌ను రూపొందిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇది ప్రత్యక్ష ఆడియో సంభాషణలను వినడానికి, అందులో పార్టిసిపేట్ చేయడానికి కస్టమర్లను అనుమతిస్తుంది. మార్క్ జుకర్‌బర్గ్ నడుపుతున్న ఫేస్‌బుక్ ఈ […]

Update: 2021-04-20 04:13 GMT

దిశ, ఫీచర్స్: ఆడియో చాట్ యాప్ ‘క్లబ్‌హౌజ్’ పాపులారిటీ క్రమంగా పెరుగుతుందని ఇది వరకే చెప్పుకున్నాం. ఇండియాలోనూ దీని డౌన్‌లోడ్స్ పెరగడంతో ట్విట్టర్ కూడా ‘స్పేసెస్’ అనే ఆడియో చాట్ కన్వర్జేషన్స్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘లైవ్ ఆడియో రూమ్స్’ అనే కొత్త ఫీచర్‌ను రూపొందిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇది ప్రత్యక్ష ఆడియో సంభాషణలను వినడానికి, అందులో పార్టిసిపేట్ చేయడానికి కస్టమర్లను అనుమతిస్తుంది.

మార్క్ జుకర్‌బర్గ్ నడుపుతున్న ఫేస్‌బుక్ ఈ వేసవి నాటికి ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ప్రారంభించడానికి ముందు సెలక్టెడ్ గ్రూప్స్, పబ్లిక్ ఫిగర్స్‌తో టెస్ట్ రన్ చేయాలని యోచిస్తుంది. ఇది విజయవంతమైతే ఫైనల్‌గా ఆడియో ఫీచర్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్‌కు తీసుకొస్తారు. ఈ ఫీచర్ ఉపయోగించి కస్టమర్స్ ఆడియో చర్చలను హోస్ట్ చేయడంతో పాటు సంభాషణలను రికార్డ్, షేర్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు తమ లైవ్ ఆడియో రూమ్‌లను సబ్‌స్క్రిప్షన్ లేదా వన్‌టైమ్ ఫీజు ద్వారా ఇతరులను యాక్సెస్ చేసే విధంగా రూపొందిస్తునట్లు తెలుస్తుంది.

క్లబ్‌హౌస్ పాపులారిటీ అనేక ప్రత్యక్ష ఆడియో డ్రాప్-ఇన్ సోషల్ నెట్‌వర్క్‌లను సృష్టించింది. అంతేకాదు మహమ్మారి సమయంలో ఆడియో సోషల్ నెట్‌వర్క్‌లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌బీ కూడా ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ‘ఫేస్‌బుక్ సౌండ్‌బైట్స్’ అనే మరో ఆడియో ప్రొడక్ట్‌ని కూడా ప్రకటించింది. దీని ప్రకారం షార్ట్ వీడియో క్లిప్‌లు సృష్టించడంతో పాటు షేర్ చేయొచ్చు. ఇది సేమ్ టిక్‌టాక్ వంటిదే కానీ ఇవి పూర్తిగా ఆడియో క్లిప్స్. వచ్చే నెల లేదా ఆ తర్వాతి నెలల్లో దీన్ని కూడా టెస్ట్ రన్ చేయనుంది ఎఫ్‌బీ.

Tags:    

Similar News