చిన్నారులకు మాస్క్ సురక్షితమేనా ?

దిశ, వెబ్ డెస్క్: కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గరున్న ఆయుధాలు.. సోషల్ డిస్టెన్స్, మాస్క్‌లు. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోయినా.. మన దేశంసహా చాలా దేశాల్లో సడలింపులతో కూడిన లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. అయితే మాస్క్ పెట్టుకోకపోతే ఆయా ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, చిన్న పిల్లలకు మాస్క్ పెట్టడం వల్ల ప్రమాదం పొంచి ఉందని జపాన్ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులపై కరోనా చాలా త్వరగా ఎఫెక్ట్ చూపిస్తోందని ఇప్పటికే ఆరోగ్య […]

Update: 2020-05-26 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గరున్న ఆయుధాలు.. సోషల్ డిస్టెన్స్, మాస్క్‌లు. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోయినా.. మన దేశంసహా చాలా దేశాల్లో సడలింపులతో కూడిన లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. అయితే మాస్క్ పెట్టుకోకపోతే ఆయా ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, చిన్న పిల్లలకు మాస్క్ పెట్టడం వల్ల ప్రమాదం పొంచి ఉందని జపాన్ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

చిన్నారులు, వృద్ధులపై కరోనా చాలా త్వరగా ఎఫెక్ట్ చూపిస్తోందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్నారులు, పెద్దలను బయటకు రావద్దని, వారిని ప్రయాణాలకు కూడా అనుమతించవద్దని ఆదేశించింది. తాజాగా రెండేళ్లలోపు చిన్నారులకు మాస్క్ అత్యంత ప్రమాదకరమని జపాన్ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని, మాస్క్ ధరించడం వల్ల శ్వాసతీసుకోవడం వారికి కష్టంగా మారుతుందని జపాన్ పీడియాట్రిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇలా కష్టంగా ఊపిరి తీసుకోవడం వల్ల గుండెపై భారం పెరిగి, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని అసోసియేషన్ తెలిపింది. దాంతో రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్క్ వాడొద్దని అసోసియేషన్ సూచించింది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా చిన్నపిల్లలకు మాస్క్‌లు వాడొద్దని ఇదివరకే చెప్పింది.

Tags:    

Similar News