విదేశీయుల వీసా గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల వీసా గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తు్న్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, పెనాల్టీలు విధించడం లేదని వివరించింది. సాధారణంగా విదేశీయులు వీసా గడువు పెంపునకు ప్రతి నెలకు ఒకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, గతేడాది మార్చి నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ సేవలపై నిషేధం కొనసాగుతూనే ఉన్నది. దీంతో మార్చి కంటే ముందు వచ్చి […]
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల వీసా గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తు్న్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, పెనాల్టీలు విధించడం లేదని వివరించింది. సాధారణంగా విదేశీయులు వీసా గడువు పెంపునకు ప్రతి నెలకు ఒకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, గతేడాది మార్చి నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ సేవలపై నిషేధం కొనసాగుతూనే ఉన్నది. దీంతో మార్చి కంటే ముందు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసా గడువును కేంద్రం పొడిగిస్తూ వస్తు్న్నది. అయితే, దేశం విడిచి వెళ్తున్నవారు మాత్రం తప్పకుండా తమ వివరాలను ఎఫ్ఆర్‌వో/ఎఫ్ఆర్ఆర్‌వోలో నమోదుచేసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆదేశించింది.