పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువులను పెంచింది. వీటిలో ఎంసెట్, ఎల్‌పిఈసెట్, పీఈసెట్‌, మోడల్‌ స్కూల్స్‌, టీఎస్‌ ఐసెట్‌లు ఉన్నాయి. ఎంసెంట్ దరఖాస్తు గడువు జులై 8 వరకు ఎంసెట్ దరఖాస్తు గడువును జులై 8 వరకు పొడగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని జెఎన్‌టీయూ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ పరీక్షకోసం ఇప్పటి వరకు 2,35,802 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్ విభాగం కోసం 1,55,677 […]

Update: 2021-07-01 10:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువులను పెంచింది. వీటిలో ఎంసెట్, ఎల్‌పిఈసెట్, పీఈసెట్‌, మోడల్‌ స్కూల్స్‌, టీఎస్‌ ఐసెట్‌లు ఉన్నాయి.

ఎంసెంట్ దరఖాస్తు గడువు జులై 8 వరకు

ఎంసెట్ దరఖాస్తు గడువును జులై 8 వరకు పొడగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని జెఎన్‌టీయూ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ పరీక్షకోసం ఇప్పటి వరకు 2,35,802 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్ విభాగం కోసం 1,55,677 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 80,125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 5 నుంచి 9 వరకు నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షను రీషెడ్యూల్ చేపట్టి ఆగస్ట్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.

పీఈ సెట్‌ దరఖాస్తు గడువు జులై15 వరకు

పీఈసెట్ దరఖాస్తు గడువును జులై 15 వరకు పొడగించనట్టుగా పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ప్రకటించారు. డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

మోడల్‌ స్కూల్స్‌లో దరఖాస్తు గడువు జులై 7 వరకు

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును జూలై 7వ వరకు పొడిగించారు. 6 నుంచి 10వరకు కొత్త సీట్లను, మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు.

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు జులై 8వరకు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. ఆలస్య రుసుముల లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్ కె.రాజిరెడ్డి పేర్కొన్నారు.

ఎల్‌పీసెట్‌ దరఖాస్తు గడువు జూలై 12 వరకు

ఎల్‌పీసెట్ దరఖాస్తు గడువును జులై 12 వరకు పొడగించారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ కింద పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరేందుకు ఎల్‌పీసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జులై 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్‌ శ్రీనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్షను జూలై 25వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News