భారీగా పెరిగిన భారత్ ఎగుమతులు.. ఎంతంటే ?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఆగష్టు నెలకు సంబంధించి భారత ఎగుమతులు 45.17 శాతం పెరిగి రూ. 2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు గురువారం వెల్లడించాయి. ఇక, సమీక్షించిన నెలలో దిగుమతులు 51.47 శాతం వృద్ధితో రూ. 3.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇవి 2.26 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో వాణిజ్య లోటు రూ. 1.02 లక్షల కోట్లుగా నమోదయాయి. గతేడాది వాణిజ్య లోటు రూ. 60 […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఆగష్టు నెలకు సంబంధించి భారత ఎగుమతులు 45.17 శాతం పెరిగి రూ. 2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు గురువారం వెల్లడించాయి. ఇక, సమీక్షించిన నెలలో దిగుమతులు 51.47 శాతం వృద్ధితో రూ. 3.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇవి 2.26 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో వాణిజ్య లోటు రూ. 1.02 లక్షల కోట్లుగా నమోదయాయి. గతేడాది వాణిజ్య లోటు రూ. 60 వేల కోట్లుగా మాత్రమే ఉన్నాయి.
అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగష్టు మధ్య కాలంలో ఎగుమతుల విలువ రూ. 11.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ. 4.82 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 66.92 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అదేవిధంగా, ఏప్రిల్-ఆగష్టు మధ్య దిగుమతులు 81.75 శాతం పెరిగి రూ. 16.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి.