వ్యభిచారం మాటున లూటీ.. యువకులను ఆటోలో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి..
దిశ, కాళోజి జంక్షన్ : ఒంటరిగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకోని దోపిడీలకు పాల్పడుతున్న భార్య భర్తలతో పాటు ఒక మైనర్ బాలుడుని సీసీఎస్, మామూనూర్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శుక్రవారం వివరాలను వెల్లడిస్తూ.. సరిత అనే మహిళ గతంలో మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ టికెట్లను విక్రయించడంతో పాటు వ్యభిచార వృత్తిని కొనసాగించేదని తెలిపారు. ఇదే సమయంలో సరిత రాజేష్‌ను వివాహం చేసుకుంది. వ్యభిచారం […]
దిశ, కాళోజి జంక్షన్ : ఒంటరిగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకోని దోపిడీలకు పాల్పడుతున్న భార్య భర్తలతో పాటు ఒక మైనర్ బాలుడుని సీసీఎస్, మామూనూర్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శుక్రవారం వివరాలను వెల్లడిస్తూ.. సరిత అనే మహిళ గతంలో మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ టికెట్లను విక్రయించడంతో పాటు వ్యభిచార వృత్తిని కొనసాగించేదని తెలిపారు. ఇదే సమయంలో సరిత రాజేష్‌ను వివాహం చేసుకుంది. వ్యభిచారం ముసుగులో ఒంటరిగా ఉన్న యువకులను ఆటోలో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ వారిని బెదిరించి డబ్బు దోచుకోనేవారు. పలుమార్లు ఇదే తరహలో ఈ జంట పలు దోపిడీలకు పాల్పడ్డారు. 2018 సంవత్సరంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని బెదిరించి అతని నుండి 12వేల రూపాయలు, ఒక సెల్ ఫోన్ చోరీ చేసిన సంఘటనలో పోలీసులు ఈ జంటతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కరీంనగర్ నుండి వరంగల్ బస్టాండ్‌లో ప్లాస్టిక్ బ్యాగ్ తో దిగిన ఒక వ్యక్తిని సరిత పరిచయం చేసుకుంది.
వ్యభిచారం ముసుగులో వ్యక్తిని అటోలో ఎక్కించుకోని శంభునిపేట మీదుగా గుంటూరు పల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళింది. తన భర్తకు ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో భర్త రాజేష్ మరో మైనర్ బాలుడుతో ద్విచక్రవాహనంపై వచ్చి సదరు వ్యక్తిని కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద 70వేల రూపాయలు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ ను లాక్కొని, నిందితులు ముగ్గురు ద్విచక్రవాహనంపై పారిపోయినట్లు ఫిర్యాదు చేయడంతో మామూనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.