ఖర్చులేకుండా ఖరీదైన వైద్య పరీక్షలు : ఎమ్మెల్యే బొల్లం

దిశ, కోదాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.. వర్షాకాలం దోమల వల్ల డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికంగా డెంగ్యూ, […]

Update: 2021-08-05 06:35 GMT

దిశ, కోదాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.. వర్షాకాలం దోమల వల్ల డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికంగా డెంగ్యూ, మలేరియా కేసులు ఉన్నందున జిల్లా వైద్య శాఖ అధికారికి ఫోన్ ద్వారా ఇక్కడ మెరుగైన వైద్య సేవలు, పరీక్షలకు సంబంధించిన పరికరాలను అందించాలని సూచించారు. ఖర్చు లేకుండా ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ మరో ముందడుగు వేస్తుంది అని ఆయన గుర్తు చేశారు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కొవిడ్ పై విజయం సాధించాలి అని ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే నిర్వహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం చిలుకూరు గ్రామానికి చెందిన సుడిగాలి వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఇబ్బంది పడుతున్న అతనికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ కుమార్, సొసైటీ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ కొండ సైదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్, పీఎస్ఎస్ చైర్మన్ అలసగాని జనార్ధన్, మాజీ జెడ్పీటీసీ బట్టలు శివాజీ నాయక్, సర్పంచులు కోడారి వెంకటేశ్వర్లు, వేనేపల్లి ఉపేందర్, కస్తూరి నరసయ్య, కడియాల వెంకటేశ్వర్లు, కోడారి రాంబాబు, ఎంపీడీవో ఈదయ్య, భాషా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News