60 శాతానికి పైగా అమ్మకాల వృద్ధి సాధించగలం: టయోటా
దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే ఈసారి హోల్‌సేల్ వాహన అమ్మకాల్లో 60 శాతం వృద్ధి సాధించగలమని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) వెల్లడించింది. ఇటీవల వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో డిమాండ్ కొవిడ్‌కి ముందుస్థాయికి తిరిగొచ్చామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కస్టమర్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయని, ఈ ఏడాది దాదాపు 1.3 లక్షల యూనిట్లను సరఫరా చేయాల్సి ఉందని కంపెనీ అసోసియేట్ జనరల్ మేనేజర్ వైస్‌లైన్ సిగమణి చెప్పారు. గతేడాది కంపెనీ మొత్తం 76,111 యూనిట్లను డీలర్లకు […]
దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే ఈసారి హోల్‌సేల్ వాహన అమ్మకాల్లో 60 శాతం వృద్ధి సాధించగలమని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) వెల్లడించింది. ఇటీవల వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో డిమాండ్ కొవిడ్‌కి ముందుస్థాయికి తిరిగొచ్చామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కస్టమర్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయని, ఈ ఏడాది దాదాపు 1.3 లక్షల యూనిట్లను సరఫరా చేయాల్సి ఉందని కంపెనీ అసోసియేట్ జనరల్ మేనేజర్ వైస్‌లైన్ సిగమణి చెప్పారు. గతేడాది కంపెనీ మొత్తం 76,111 యూనిట్లను డీలర్లకు పంపించామని, ఇంకా ఆర్డర్లు పెరుగుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడున్న డిమాండ్‌ను పరిశీలిస్తే కరోనాకు ముందు స్థాయికి చేరుకుంటామన్నారు.
ప్రధానంగా ఇన్నో క్రిస్టా, ఫార్చునర్ మోడళ్లకు వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన సాధించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల ద్వారానే వినియోగదారుల సంఖ్యను, ఆర్డర్లను మెరుగ్గా కొనసాగించేందుకు వీలవుతోందని సిగమణి చెప్పారు. అలాగే, ఈ ఏడాది టయోటా గ్లాంజా, అర్బన్ క్రూజర్ మోడళ్లు విజయవంతమైన కార్లుగా నిలిచాయి. కొత్త కస్టమర్లకు ఈ కార్లు మెరుగైన ఎంపికగా ఉన్నాయని, రానున్న రోజుల్లో ఇతర మోడళ్లు కూడా అమ్మకాలను సాధించగలవని ఆయన వివరించారు. వీటి ద్వారా దేశంలోని టైర్2, టైర్3 నగరాలకు విస్తరించేందుకు దోహదపడింది.