చిన్న రుణాలకు డిమాండ్: హెచ్‌డీఎఫ్‌సీ కంట్రీ హెడ్ అరవింద్

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా కంపెనీలు, ఉద్యోగుల జీతాలపై తీవ్ర ప్రభావం కనబడుతోంది. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో రుణాల తీరు ఎలా ఉంటుందనే దానిపైనే ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ అంచనాలు వేస్తోంది. ఇకపై వినియోగదారులు ఆచితూచి ఖర్చులు చేసే అవకాశముందని ఆ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఉద్యోగుల వేతనాల కోతల వల్ల రుణాలపై ప్రభావం ఉండదని, కొంత […]

Update: 2020-05-28 00:57 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా కంపెనీలు, ఉద్యోగుల జీతాలపై తీవ్ర ప్రభావం కనబడుతోంది. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో రుణాల తీరు ఎలా ఉంటుందనే దానిపైనే ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ అంచనాలు వేస్తోంది. ఇకపై వినియోగదారులు ఆచితూచి ఖర్చులు చేసే అవకాశముందని ఆ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఉద్యోగుల వేతనాల కోతల వల్ల రుణాలపై ప్రభావం ఉండదని, కొంత మార్పు అయితే ఉంటుందని పేర్కొంది. కరోనా వల్ల రెండు నెలల నుంచి విక్రయాలు లేని వాహన రంగం మళ్లీ పుంజుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాహన విక్రయాలు పెరుగుతాయని, రుణాలు కొంత కాలం తర్వాత తిరిగి పుంజుకుంటాయని, దీనికి సామాజిక దూరం నిబంధనలు, బ్యాంకులు అందించే డిజిటల్ రుణాలు అండగా ఉంటాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ చిన్న రుణాలకు డిమాండ్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ రుణాలు పెరిగితే సేల్స్ పెరిగే అవకాశముందని వివరించారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై స్పందించిన అరవింద్..వ్యాపారానికి మూలధనం పెద్ద అడ్డంకి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్న క్రమంలో గతేడాది చేపట్టిన పన్ను సంస్కరణల కన్నా రుణ హామీల నుంచి ప్రయోజనాలు అందించడం మంచిదే అని చెప్పారు. సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాలన్నారు.

Tags:    

Similar News