గ్యాస్ గోదాం సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా
దిశ, రంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మూడు నెలలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు జిల్లా నోడల్ ఆఫీసర్ రామ ఇప్పిలి ఓ ప్రకటన విడుదల చేశారు. కష్టకాలంలో ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్న మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉచిత సిలిండర్‌లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇస్తామని తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద 8 లక్షల కనెక్షన్లు ఉన్నాయని […]
దిశ, రంగారెడ్డి:
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మూడు నెలలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు జిల్లా నోడల్ ఆఫీసర్ రామ ఇప్పిలి ఓ ప్రకటన విడుదల చేశారు. కష్టకాలంలో ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్న మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉచిత సిలిండర్‌లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇస్తామని తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద 8 లక్షల కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. వీటిని సరఫరా చేసేందుకు పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్‌తో మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ గోదాంలు, ఆఫీసుల్లో పనిచేసే అందరికీ వర్తిస్తుందని తెలిపారు.
Tags: Exgressia, gas goddamn staff, ranagareddy, central govt, nodal officers