కొత్త బిల్డింగ్ కట్టినా.. అద్దె ఆఫీసులోనే అధికారులు
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 గుంటల విస్తీర్ణానికి పైగా స్థలంలో నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనం అన్ని హంగులతో పూర్తయింది. సుమారు రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని నేటికీ ఎక్సైజ్ శాఖకు అప్పగించలేదు. బిల్డింగ్ పూర్తి జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జిల్లా కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తున్నది. బిల్డింగ్ నిర్మించిన సంబంధిత కాంట్రాక్టర్లకు సుమారు రూ.12 లక్షల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నూతన బిల్డింగ్ ఆ శాఖకు అప్పగించలేదు. […]
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 గుంటల విస్తీర్ణానికి పైగా స్థలంలో నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనం అన్ని హంగులతో పూర్తయింది. సుమారు రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని నేటికీ ఎక్సైజ్ శాఖకు అప్పగించలేదు. బిల్డింగ్ పూర్తి జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జిల్లా కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తున్నది. బిల్డింగ్ నిర్మించిన సంబంధిత కాంట్రాక్టర్లకు సుమారు రూ.12 లక్షల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నూతన బిల్డింగ్ ఆ శాఖకు అప్పగించలేదు. అద్దె భవనంలో నడుస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయంకు సరిపడా స్థలం లేకపోవడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ ఉన్న బిల్లులను చెల్లించి ఎక్సైజ్ శాఖకు నూతన భవనాన్ని కేటాయించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.