కంటైన్‌మెంట్ ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ అమలులో భాగంగా నిజామాబాద్ నగరంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పోలీసు అధికారులు పరిశీలించారు. ఫ్రూట్ మార్కెట్, ఆటోనగర్, మాలపల్లిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయా ఏరియాల్లో ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారనే విషయమై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైవ్ మానిటరింగ్ చేసి అనవసరంగా రోడ్డుపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. పని […]
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ అమలులో భాగంగా నిజామాబాద్ నగరంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పోలీసు అధికారులు పరిశీలించారు. ఫ్రూట్ మార్కెట్, ఆటోనగర్, మాలపల్లిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయా ఏరియాల్లో ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారనే విషయమై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైవ్ మానిటరింగ్ చేసి అనవసరంగా రోడ్డుపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. పని లేకుండా రోడ్లపై తిరిగే వారి బైకులను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
Tags: Nizamabad, continement areas, drone cameras, Acp