అనురాగ్‌కు ఎక్స్ వైఫ్ సపోర్ట్..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై ఆయన మాజీ భార్య కల్కి కొచ్చిన్ స్పందించింది. ఈ మేరకు అనురాగ్‌కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ సోషల్ మీడియా సర్కస్‌ను పట్టించుకోవద్దని, దీనికి దూరంగా ఉండాలని కోరింది. మీ స్క్రిప్టులో, సినిమాల్లో మహిళల స్వేచ్ఛ కోసం పోరాడారని.. వృత్తిపరమైన స్థలంలోనూ మహిళలు గౌరవంగా ఉండేలా చూసుకున్నారని.. వ్యక్తిగత జీవితంలోనూ మహిళా సమగ్రతకు మద్దతిచ్చారని […]

Update: 2020-09-22 00:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై ఆయన మాజీ భార్య కల్కి కొచ్చిన్ స్పందించింది. ఈ మేరకు అనురాగ్‌కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ సోషల్ మీడియా సర్కస్‌ను పట్టించుకోవద్దని, దీనికి దూరంగా ఉండాలని కోరింది. మీ స్క్రిప్టులో, సినిమాల్లో మహిళల స్వేచ్ఛ కోసం పోరాడారని.. వృత్తిపరమైన స్థలంలోనూ మహిళలు గౌరవంగా ఉండేలా చూసుకున్నారని.. వ్యక్తిగత జీవితంలోనూ మహిళా సమగ్రతకు మద్దతిచ్చారని తెలిపింది. అందుకు తనే ఓ ఉదాహరణ అన్న కల్కి.. అనురాగ్ ఎప్పుడూ తనను తనతో సమానంగా చూశారని, విడాకుల తర్వాత కూడా తన కోసం నిలబడ్డారని తెలిపింది. తనతో పెళ్లికి ముందు.. పని చేసే వాతావరణంలో ఇబ్బందిపడ్డ సందర్భంలోనూ మద్దతిచ్చారని చెప్పింది.

అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రమాదకరమని తెలిపిన కల్కి.. ఇలాంటి పరిణామాలు కుటుంబాలు, స్నేహితులు, దేశాలను నాశనం చేస్తాయని అభిప్రాయపడింది. ‘అనురాగ్ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థలం ఉంది. మీ చుట్టూ ఉన్న వారి అవసరాల గురించి శ్రద్ధ, దయ చూపే మీరు అక్కడే ఉండాలి.. అంతే ఉన్నతంగా ఉండాలి’ అని కోరుకుంది.

Tags:    

Similar News