రాజ్యసభకు దేవేగౌడ నామినేషన్ దాఖలు
బెంగళూరు : మాజీ ప్రధాని, జనతా దళ్(సెక్యూలర్) అధినేత హెచ్ డీ దేవెగౌడ రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో దేవేగౌడ పోటీ చేస్తారని.. ఆయన కుమారుడు కుమారస్వామి సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర […]
బెంగళూరు : మాజీ ప్రధాని, జనతా దళ్(సెక్యూలర్) అధినేత హెచ్ డీ దేవెగౌడ రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో దేవేగౌడ పోటీ చేస్తారని.. ఆయన కుమారుడు కుమారస్వామి సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర జాతీయ నేతల కోరిక మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దేవెగౌడ అంగీకరించారని కుమారస్వామి తెలిపారు.
87 ఏండ్ల వయసులో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం అంత సులువు కాదని, రాజకీయాల్లో ఎన్నో గెలుపోటములను చవిచూశారని కుమారస్వామి పేర్కొన్నారు. ఖాళీ అయిన పలు రాష్ట్రాల రాజ్యసభ సీట్ల భర్తీకి ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.