అక్కడ తడుపుతూ.. ఇక్కడ ఎండబెడుతున్నాడు

దిశ, మెదక్: హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణలో భాగం కాదా అని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ సాధన కార్యచరణపై శుక్రవారం హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశానికి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన నియోజకవర్గంలోని పొలాలను తడుపుకుంటూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొలాలను మాత్రం ఎండ పెడుతున్నాడని ఆరోపించారు. గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ ప్రారంభించడం వల్లే వివక్ష చూపుతున్నారని […]

Update: 2020-05-29 06:15 GMT

దిశ, మెదక్: హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణలో భాగం కాదా అని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ సాధన కార్యచరణపై శుక్రవారం హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశానికి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన నియోజకవర్గంలోని పొలాలను తడుపుకుంటూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొలాలను మాత్రం ఎండ పెడుతున్నాడని ఆరోపించారు. గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ ప్రారంభించడం వల్లే వివక్ష చూపుతున్నారని పొన్నం మండిపడ్డారు. మిడ్ మానేరు నుంచి నీరు వచ్చే సొరంగ మార్గం, ఆనకట్ట నిర్మాణం పూర్తయిందని కేవలం రెండు లింకులు కలిపితే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తవుతుందని తెలిసినా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణలో అంతర్భాగమేనని.. ప్రాజెక్టు నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News