ఆయన ప్రగతి భవన్ దాటక పోవడం దారుణం…
దిశ, వెబ్ డెస్క్: వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ దాటక పోవడం దారుణమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వర్షాలతో ఎంతమంది చనిపోయారో ఇప్పటి దాకా ఎలాంటి సైంటిఫిక్ సర్వే చేయలేదని ఆయన అన్నారు. వర్షం కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ లో సీఎం సాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సాయం కేవలం టీఆర్ఎస్ […]
దిశ, వెబ్ డెస్క్:
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ దాటక పోవడం దారుణమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వర్షాలతో ఎంతమంది చనిపోయారో ఇప్పటి దాకా ఎలాంటి సైంటిఫిక్ సర్వే చేయలేదని ఆయన అన్నారు. వర్షం కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ లో సీఎం సాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సాయం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందుతోందని అన్నారు. వాస్తవంగా నష్టపోయిన వారికి ఈ సాయం అందడం లేదని ఆయన అన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలనీ ఆయన కోరారు.