'వైఎస్ఆర్‌ను సీఎం చేయడం వల్లే కాంగ్రెస్‌కు నష్టం జరిగింది'

దిశ, ఏపీ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు. నాడు వైఎస్ సీఎం కాకపోయి ఉంటే నేడు జగన్ బలపడేవాడే కాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు సీఎం కూడా అయ్యేవాడు కాదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. […]

Update: 2021-10-06 07:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు. నాడు వైఎస్ సీఎం కాకపోయి ఉంటే నేడు జగన్ బలపడేవాడే కాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు సీఎం కూడా అయ్యేవాడు కాదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి..చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ బిల్లులు, పాకెట్ మనీ నిధులను పక్కదారి పట్టిస్తోందని చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు నిలిచిపోయాయంటూ ధ్వజమెత్తారు. దీపావళి లోపు ఎస్సీ ఫైనాస్ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసి, నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

త్వరలో గుంటూరు, విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన
కేంద్ర ప్రభుత్వంపై సీడబ్ల్యూసీ మెంబర్ చింతా మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రల్ ధరలు మోడీ హయాంలో విపరీతంగా పెరిగి పోయాయన్నారు. నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, విశాఖ ఉక్కును ఇందిరా హయాంలో ఏర్పాటు అయ్యాయని గుర్తు చేశారు. దేశానికి కాంగ్రెస్ విధానాలే మేలు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరుణంలో దేశానికి నెహ్రూ, ఇందిరా గాంధీ తెచ్చిన సోషలిస్టు విధానాలే శరణ్యమని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశానికి రైతులు వెన్నుముక అని అలాంటి రైతులపై వాహనాలు ఎక్కించి చంపడం దారుణమన్నారు. త్వరలో విశాఖ నగరానికి, గుంటూరుకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల పోరాటానికి రాహుల్ గాంధీ మద్దతు పలుకుతారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు పరిశ్రమను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో పీసీసీలో మార్పులు
ఆంధ్రప్రదేశ్ పీసీసీలో త్వరలో మార్పులు ఉంటాయని మాజీ ఎంపీ చింతా మోహన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నేతల కొరత ఉందని అన్నారు. మచ్చలేని నాయకుడు, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడు కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ..ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎవరితో పొత్తు లేకుండా 2024 అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చింతా మోహన్ అన్నారు.

Tags:    

Similar News