MLA Aadimulam: ఎమ్మెల్యే ఆదిమూలం‌కు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

సత్యవేడు నియోజకవర్గ (Satyavedu Constituency) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి (Koneti Aadimulam)కు భారీ ఊరట లభించింది.

Update: 2024-09-25 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సత్యవేడు నియోజకవర్గ (Satyavedu Constituency) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి (Koneti Aadimulam)కు భారీ ఊరట లభించింది. ఇటీవలే ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టవేసింది. బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ నుంచి ఆదిమూలంను బహిష్కరిస్తున్నట్లుగా టీడీపీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆదిమూలం ఇటీవలే ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసును డిస్మిస్ చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది.

కాగా.. తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధించారని, అత్యాచారానికి పాల్పడిన వీడియో టేపులను మీడియాకు విడుదల చేసిన మహిళ ఎమ్మెల్యేతో రాజీ పడినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ (Tirupati East Police Station)లో ఎమ్మెల్యేపై పెట్టిన రేప్ కేసును కూడా వెనక్కి తీసుకుంది. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం కూడా పూర్తిగా అవాస్తవమని ఆ మహిళ పేర్కొ్ంది. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఎమ్మె్ల్యేపై పోలీసులు పెట్టిన కేసుల్లోని సెక్షన్లు వర్తించవని ఆయన తరఫు న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీసు అధికారి నమోదు చేశారని వాదనలు వినిపించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే సెప్టెంబరు 5న కేసు నమోదు చేశారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. బాధిత మహిళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పినవి అవాస్తవాలంటూ నోటరీతో కూడిన అఫిడవిట్‌ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ వీ.ఆర్‌.కే కృష్ణసాగర్ (Justice VRK Krishnasagar), ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు.


Similar News