AP High Court:తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు కేఏ పాల్!

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదం పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

Update: 2024-09-25 08:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కల్తీ లడ్డూ ప్రసాదం పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కల్తీ లడ్డూ వివాదం పై పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల(Tirumala) శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం తయారీలో ఉపయోగంచిన నెయ్యిలో జంతు కొవ్వు(Animal Fat) కలిసినట్లు నిర్ధారణ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఈ క్రమంలో లడ్డూ వ్యవహారంలో నేడు (బుధవారం) మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ లడ్డూ(Tirumala Laddu) వివాదంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రస్తుతం సమయం లేదని తేల్చి చెప్పింది. వచ్చే వారం రెగ్యూలర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్‌కు హైకోర్ట్ ధర్మాసనం సూచించినట్లు సమాచారం.

Read More..

MLA Aadimulam: ఎమ్మెల్యే ఆదిమూలం‌కు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు 


Similar News