జార్జ్ ప్లాయిడ్ మృతికి కారణమైనవారిని శిక్షించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట అమెరికా కాన్సులేట్ చీఫ్ ఆఫీసర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి ఆడటం లేదని మోత్తుకున్నా పోలీసులు వినిపించుకోకుండా గొంతు నొక్కి చంపారన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఎంతో కాలంగా వర్ణ […]
దిశ, న్యూస్‌బ్యూరో: జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట అమెరికా కాన్సులేట్ చీఫ్ ఆఫీసర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి ఆడటం లేదని మోత్తుకున్నా పోలీసులు వినిపించుకోకుండా గొంతు నొక్కి చంపారన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఎంతో కాలంగా వర్ణ వివక్షత కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సంఘటన దానికి పరాకాష్ట అన్నారు. ఈ సంఘటనను నిరస్తూ యావత్ ప్రపంచం ఉద్యమిస్తుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులకు భయపడి వైట్‌హౌస్ బంకర్‌లో తలదాచుకున్నాడన్నారు.