ఈటల, హరీష్ మధ్య తేడా అదే.. మాజీ MLC మోహన్ రెడ్డి ఇంట్రెస్టింట్ కామెంట్స్
దిశ, హుజురాబాద్ రూరల్ : ఈటల గెలిస్తే రాష్ట్రంలో అనేక మార్పులు వస్తాయని మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ నేత మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్ల పాటు పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని 15 మంది ముఖ్యమంత్రులను చూశానన్నారు. వారెవరూ చేయని మోసం సీఎం కేసీఆర్ చేశాడని ఆరోపించారు. విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఎంఈఓల ఖాళీలు వెక్కిరిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని ‘విధానం’ తెలంగాణలో అమలవుతోందని […]
దిశ, హుజురాబాద్ రూరల్ : ఈటల గెలిస్తే రాష్ట్రంలో అనేక మార్పులు వస్తాయని మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ నేత మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్ల పాటు పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని 15 మంది ముఖ్యమంత్రులను చూశానన్నారు. వారెవరూ చేయని మోసం సీఎం కేసీఆర్ చేశాడని ఆరోపించారు. విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఎంఈఓల ఖాళీలు వెక్కిరిస్తున్నాయని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని ‘విధానం’ తెలంగాణలో అమలవుతోందని మోహన్ రెడ్డి ఆరోపించారు. చర్చలు జరిపి ఒక్కటే జీవో తెస్తానని ప్రకటించిన సీఎం 6 ఏళ్ళు గడిచినా ఆ జీఓకు మాత్రం మోక్షం కలగలేదన్నారు. నీళ్లు, నియామకాల కోసం సకల జనుల సమ్మె చేశామని, ఎమ్మెల్సీగా తాను చీఫ్ సెక్రటరికి నోటీస్ ఇచ్చానని ఆ తర్వాత సమ్మె తారాస్థాయికి చేరిందన్నారు. కేసీఆర్‌కు అన్ని రకాలుగా సహకరించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్రాంత ఉపాధ్యాయులతో పాటు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు బాధ పడుతున్నారని అన్నారు. పెన్షన్లు, జీతాలు సకాలంలో రావడం లేదన్నారు. తమ డబ్బులు ఆపి వివిధ పథకాలకు మల్లిస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు కష్టపడితేనే తెలంగాణ వచ్చిందని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. గురుకుల వ్యవస్థ, పాఠశాలలను కూడా సక్రమంగా నడపడంలేదని ఆరోపించారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలి. విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈటలను గెలిపిస్తే రాష్ట్రంలో మార్పు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1వ తేదీన జీతాలు ఇస్తే హరీష్ హయాంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియడం లేదని ఆరోపించారు.
ఈటల టైంలో 43 శాతం పీఆర్సీ అమలు చేస్తే ఇప్పుడు 30 శాతం మాత్రమే ఇచ్చారన్నారు. ఈ ఇద్దరు ఆర్థిక మంత్రుల మధ్య తేడాను గుర్తించాలని మోహన్ రెడ్డి సూచించారు. 2015లో ఈటల ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు. పెన్షనర్లకు 6 నెలలకోసారి ఇచ్చే
డీఏ పెండింగ్‌లో ఉందన్నారు.