‘కోమటిరెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియదు’
దిశ, మునుగోడు: ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియని అయోమయ స్థితిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు సంతోష పడ్డారని.. రెండోసారి ఎన్నికల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయం వారిని దురదృష్టంలో పడేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాను […]
దిశ, మునుగోడు: ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియని అయోమయ స్థితిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రజలు సంతోష పడ్డారని.. రెండోసారి ఎన్నికల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయం వారిని దురదృష్టంలో పడేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో వుంటారో తనకే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి కోసం ఒక్క కొబ్బరికాయ కొట్టి వంద పనులు చేస్తా అని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో కనిపించని ఎమ్మెల్యే ఇప్పుడు హడావిడి చేయడం హాస్యాస్పదం అన్నారు. ఆహార భద్రత కార్డులు లబ్ధిదారులకు మంత్రి ఇస్తుంటే ఆపడం సబబు కాదని విమర్శలు చేశారు.