ఎల్ఆర్ఎస్ పెట్టి ఖజానాను నింపుకోం

దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఖజానా నింపుకోవాలని బీజేపీ చూడదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అడుగడుగునా ఆంక్షలు విధించారన్నారు. రైతుల స్వేచ్ఛకోసమే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చారని.. తాము పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకోవచ్చన్నారు. ఏ రంగానికి ఎంత కరెంట్ అవసరమో తెలపడానికే మీటర్లు […]

Update: 2020-10-08 06:27 GMT

దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఖజానా నింపుకోవాలని బీజేపీ చూడదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అడుగడుగునా ఆంక్షలు విధించారన్నారు. రైతుల స్వేచ్ఛకోసమే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చారని.. తాము పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకోవచ్చన్నారు. ఏ రంగానికి ఎంత కరెంట్ అవసరమో తెలపడానికే మీటర్లు పెట్టడం జరుగుతుందని, దీని ద్వారా రైతులను ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. ఈ బిల్లులో ఉన్న సౌకర్యాలు కాంగ్రెస్ నేతలకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రైతు బిల్లులో సీఎం కేసీఆర్‎కు లోపాలు కనిపిస్తే రౌండ్ టేబుల్ సమావేశంపెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా తమవే అని అబద్దాలు చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ బతకొద్దని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News