షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ భార్య?
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించనున్న క్రమంలో వైఎస్ షర్మిలను పలువురు ప్రముఖులు కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా.. తాజాగా షర్మిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన స్వరన్ జీత్ సేన్ భార్య అనితా సేన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో అనితా సేన్ భేటీ అయ్యారు. షర్మిలతో పాటు అనిల్ కుమార్‌తో చర్చలు జరిపారు. దీంతో అనితా సేన్ షర్మిల […]
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించనున్న క్రమంలో వైఎస్ షర్మిలను పలువురు ప్రముఖులు కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపగా.. తాజాగా షర్మిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన స్వరన్ జీత్ సేన్ భార్య అనితా సేన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవాళ లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో అనితా సేన్ భేటీ అయ్యారు. షర్మిలతో పాటు అనిల్ కుమార్‌తో చర్చలు జరిపారు. దీంతో అనితా సేన్ షర్మిల పార్టీతో చేరతారనే వార్తలొస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు స్వరన్ జీత్ సేన్ డీజీపీగా పనిచేశారు. ఈ సమయంలో వైఎస్‌కు, ఆయనకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో స్వరన్ జీత్ సేన్ భార్య అనితా సేన్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలున్నాయి.