కరోనాతో నేలరాలిన మాజీ కౌన్సిలర్…

దిశ, వేములవాడ: కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ కౌన్సిలర్ కరోనాతో మృతి చెందిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీను కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గత మూడు రోజుల క్రితం కరోనా నిర్థారణ కావడంతో కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్చారు. కాగా శ్రీను ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. ఆయన మృతిపై స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు.

Update: 2021-05-01 10:29 GMT

Tags:    

Similar News