హుజురాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం..
దిశ ప్రతినిధి, వరంగల్ : హజురాబాద్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని శుక్రవారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశామని, పోలింగ్ రోజు ఉదయం మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో క్లియర్ చేసి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. కోవిడ్ నిబంధనలను […]
దిశ ప్రతినిధి, వరంగల్ : హజురాబాద్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని శుక్రవారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశామని, పోలింగ్ రోజు ఉదయం మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో క్లియర్ చేసి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఎన్నికల ఏజెంట్లకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసినట్లు వివరించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నివేదిక ఇస్తేనే పోలీంగ్ స్టేషన్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. ఉప ఎన్నికకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నివారించేందుకు విజిలెన్స్ టీంలు పని చేస్తున్నాయన్నారు.