ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం: రిటర్నింగ్ అధికారి

దిశ, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ ను మంగళవారం జారీ చేశారు. స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి మంగళవారం నుంచి మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ […]

Update: 2021-11-16 05:15 GMT

దిశ, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ ను మంగళవారం జారీ చేశారు. స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి మంగళవారం నుంచి మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 26 లోగా ఉపసంహరణకు గడువు నిర్ణయించగా, అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారని మెదక్ జిల్లా కలెక్టర్ డా. ఎస్.హరీష్ తెలిపారు.

Tags:    

Similar News