లాక్‌డౌన్ ఎత్తివేత.. ఇక తెలంగాణలో అన్నీ ఓపెన్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గి, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈమేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి యథావిధిగా […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గి, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈమేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి యథావిధిగా సినిమా హాళ్లు, పబ్బులు, పార్కులు, రెస్టారెంట్లు, బార్లు, మెట్రో సర్వీసులు, బస్సులు ప్రారంభం కానున్నాయి. అంతేగాకుండా.. జులై ఫస్ట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.