సమాజ హితం కోసమే ‘రైతన్న’ సినిమా: ఎమ్మెల్యే నోముల భగత్

దిశ, హలియా: సమాజ హితం కోసమే ‘రైతన్న’ సినిమాను పీపుల్ స్టార్ నారాయణమూర్తి నిర్మించారని, సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్‌ను సినీనటుడు ఆర్. నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తాను నిర్మించిన రైతన్న సినిమాను చూడాల్సిందిగా ఆర్.నారాయణ మూర్తి ఎమ్మెల్యే భగత్‌ని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ నారాయణ మూర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. […]

Update: 2021-09-01 07:33 GMT

దిశ, హలియా: సమాజ హితం కోసమే ‘రైతన్న’ సినిమాను పీపుల్ స్టార్ నారాయణమూర్తి నిర్మించారని, సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్‌ను సినీనటుడు ఆర్. నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తాను నిర్మించిన రైతన్న సినిమాను చూడాల్సిందిగా ఆర్.నారాయణ మూర్తి ఎమ్మెల్యే భగత్‌ని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ నారాయణ మూర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులంతా ‘రైతన్న’ సినిమాని వీక్షించి ఆదరించారని కోరారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు భారతదేశం లాంటి వర్ధమాన దేశాలకు సరిపోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాల వల్ల రైతులు తమపొలాలలో తామె కూలీలుగా పని చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం వృత్తి కాదు, సమస్త ప్రజానీకానికి జీవనాధారం అని పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించినప్పుడే రైతు ఆనందంగా ఉంటాడన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడం సాధ్యమవుతుందన్నారు. రైతుల సమస్యలను తెరకెక్కించిన రైతన్న చిత్రాన్ని తానూ వీక్షించిన్నట్లు తెలిపారు. రైతన్న సినిమాను మిగితా భాషల్లోకి కూడా అనువదించాలని నారాయణమూర్తిని కోరారు. రైతాంగం చిత్రం ద్వారా నారాయణ మూర్తి గొప్ప సందేశం ఇచ్చారని అన్నారు.

కేంద్ర సాగు చట్టం, విద్యుత్ సవరణ చట్టాలతో వ్యవసాయ రంగం, రైతాంగానికి కలిగే నష్టాలను, పరిష్కార మార్గాలను రైతన్న సినిమాలో నారాయణ మూర్తి అద్భుతంగా అవిష్కరించారని అన్నారు. అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమా నుంచి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలను నిర్మించిన ఆర్. నారాయణ మూర్తి 37వ సినిమా రైతన్న ఆగస్ట్ 14న విడుదలై విశేష ప్రజాధరణ పొందుతున్నదని అన్నారు. మట్టితో మనిషికి ఉన్న బంధాన్ని ఆవిష్కరించిన రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వీక్షించాలని ఆయన కోరారు. రైతన్న చిత్రం ద్వారా పారిశ్రామికవేత్తలను, కోటీశ్వరులను, బడాబాబులను చట్టసభలకు పంపకుండా రైతులను పంపించాలనే గొప్ప సందేశాన్ని నారాయణమూర్తి ఇచ్చారని అన్నారు. అన్నదాతల కష్టాలను రైతన్న సినిమా చాటిచెప్పిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, దళితబంధు పథకాలు యావత్ దేశానికి దిక్సూచి లాంటిదని అన్నారు.

దళితుల స్వావలంబన, సాధికారత కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చాలా గొప్ప పథకమని కొనియాడారు. ఈ రెండు పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో అనుముల తిరుమలగిరి (సాగర్), టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, గౌరవ సలహాదారుడు వెంపటి శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు సురభి రాంబాబు, కో ఆప్షన్ మెంబర్ చాపల సైదులు, బందిలీ సైదులు, దొర పెళ్లి వెంకన్న, రావుల లింగయ్య, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News