అంతవరకు మీరు జాగ్రత్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, రంగారెడ్డి: కరోనా మహమ్మారిని తరిమే వరకూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ ఆధ్వర్యంలో 150 మంది వికలాంగులకు, 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సబితా చేతుల మీదుగా 8 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం, వైద్యుల […]
దిశ, రంగారెడ్డి: కరోనా మహమ్మారిని తరిమే వరకూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్, స్థానిక కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ ఆధ్వర్యంలో 150 మంది వికలాంగులకు, 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సబితా చేతుల మీదుగా 8 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం, వైద్యుల సూచనలను పాటించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ చిగురింత పారిజాత చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ సత్యబాబు, మాజీ వైస్ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్ మరియు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసిషన్ అధ్యక్షులు, సభ్యులు, కాలనీ వాసులు, సబితా ఇంద్రారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.