నిజామాబాద్‌లో రక్తదానం శిబిరం
దిశ, నిజామాబాద్: నిజామాబాద్‌లోని అటవీశాఖ కాంప్లెక్సులో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రక్తం అవసరం ఉన్న పేషెంట్లకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. విపత్కర సమయంలో రక్తదానం చేయడానికి అటవీశాఖ ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయాలనుకొనే వారు కనీసం 10 యూనిట్ల నుంచి ఎన్ని యూనిట్లు అయినా ఇవ్వొచ్చని, అందుకు (08462 […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్‌లోని అటవీశాఖ కాంప్లెక్సులో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రక్తం అవసరం ఉన్న పేషెంట్లకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. విపత్కర సమయంలో రక్తదానం చేయడానికి అటవీశాఖ ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయాలనుకొనే వారు కనీసం 10 యూనిట్ల నుంచి ఎన్ని యూనిట్లు అయినా ఇవ్వొచ్చని, అందుకు (08462 251251) నెంబర్‌కు కాల్ చేసి తెలిపితే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వచ్చి సేకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సునీల్, డాక్టర్ ఫరీదా బేగం, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మే 7 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర వేళల్లో బయటకు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మత ప్రార్థనలు ఇంట్లోనే జరుపుకోవాలన్నారు.
tags : lockdown till may 7, series implementation, everyone follow, collector narayana reddy, blood donation camp