నాలుగేళ్లకోసారి వస్తాను..నా గుండె చప్పుడు వింటారా!

ఎన్నికలు అయిదేండ్లకోసారి వస్తాయి. నేను మాత్రం అదేనండీ! ఫిబ్రవరి 29ని నాలుగేళ్లకోసారి కేలండర్లలో దర్శనమిస్తాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ మీ ‘తలపు’ తట్టాను. ఎవ్రీ ఫోర్ ఇయర్స్‌కు ఒక రోజు ఎక్కువతో(366 days) వచ్చేదానిని leap year (లీపు సంవత్సరం)గా పిలుస్తారని మీకు తెలుసు.ఎలక్షన్లకు ఎంతటి ప్రియారిటీ, హడావుడి ఉంటుందో..నాకు మాత్రం అంతటి హంగామా, సందడయితే ఉండదు! కానీ, ప్రత్యేకతలు మాత్రం బోలెడు సుమీ. మచ్చుకు ఒకట్రెండు రివీల్ చేయనా! ఈ రోజు జన్మించిన శిశువులు […]

Update: 2020-02-28 19:47 GMT

ఎన్నికలు అయిదేండ్లకోసారి వస్తాయి. నేను మాత్రం అదేనండీ! ఫిబ్రవరి 29ని నాలుగేళ్లకోసారి కేలండర్లలో దర్శనమిస్తాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ మీ ‘తలపు’ తట్టాను. ఎవ్రీ ఫోర్ ఇయర్స్‌కు ఒక రోజు ఎక్కువతో(366 days) వచ్చేదానిని leap year (లీపు సంవత్సరం)గా పిలుస్తారని మీకు తెలుసు.ఎలక్షన్లకు ఎంతటి ప్రియారిటీ, హడావుడి ఉంటుందో..నాకు మాత్రం అంతటి హంగామా, సందడయితే ఉండదు! కానీ, ప్రత్యేకతలు మాత్రం బోలెడు సుమీ. మచ్చుకు ఒకట్రెండు రివీల్ చేయనా! ఈ రోజు జన్మించిన శిశువులు బర్త్ డే జరుపుకోవాలంటే, ఏకంగా నాలుగేళ్లు ఆగాల్సిందే! (పుట్టిన రోజులకు తిథులు, నక్షత్రాలను మాత్రమే ఫాలో అయ్యే వారూ kindly ignore) 2016సహా లోగడ ఇదే తేదీన పుట్టిన వాళ్లు టుడే ఎక్కడికక్కడ హ్యాపీ బర్త్ డేల సెలబ్రేషన్సు గ్రాండుగా చేసుకుంటూనే ఉంటారు. అందరిలా ప్రతి ఏటా జన్మదినోత్సవాలను ఆస్వాదించే చాన్సు ఎలాగూ ఉండదు.అయితే తక్కిన మూడేళ్ల‌లోటూ ఫుల్‌ఫిల్ అయ్యే ఫీల్ మాత్రం పొందండే ప్లీజ్! హెల్తీగా ఎంజాయ్ చేసేయండి. మీ అందరికీ నా బెస్ట్ విషెస్. వెయ్యిమందిలో ఒకరిగా ఉండే మీరు అంతే వైవిధ్యమైన ఉన్నత స్థానాలకు ఎదగాలనే నా శుభాకాంక్షల సందేశాన్ని అందుకోండి!

పేరెంట్సుకు అడ్వాంటేజే!?

ఏ ఇంట్లోనైనా పిల్లల పుట్టిన రోజు వేడుకలంటే పండగే. ఏడాదికోసారి కంపల్సరీ అనుకోండి! అదే నేడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక యాంగిల్‌లో అడ్వాంటేజే! నేను అంటే, 2024 ఫిబ్రవరి 29వచ్చే దాకా పుట్టిన రోజు సంబురాలే ఉండవు! ఆ మేరకు కొత్త బట్టలు, కేకులు, షడ్రుచుల భోజనాలు వగైరాల ఖర్చు ఏటేటా తప్పుతుంది! కలిగినోళ్ల గురించి కాదు కానీ, మిడిల్ క్లాస్ వారికి కలిసొచ్చేదే(?). డియర్ పేరెంట్స్! అలా అని పిల్లల్నినారాజ్ చేయకండే! అట్లా చేస్తే నన్ను తిట్టుకుంటారు! అన్నట్టూ, గాయ్స్ మీకూ ఓ మాట చెప్పనా? ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్‌కు ప్రతి ఏడాదీ బర్త్ డే పార్టీలు ఇచ్చే ఎక్స్‌పెండిచర్ బర్డెనూ ఉండదు! నిదానంగా నాలుగేళ్లకోసారి దావత్ ఇవ్వొచ్చు.మనీ స్పెండ్ మేటరే కాదండోయ్..రికార్డుల్లోనూ,రిజిస్టర్లలోనూ వెయ్యికో లక్షకో ఒక్కరన్నట్టుగా మీ బర్త్ డే డేటు స్పెషల్‌గా నమోదవుతుంది.ఎక్కడైనా రాయాల్సి వచ్చినపుడూ,ఎవరైనా వినేపుడు వావ్ అని మీ వంక ఓ లుక్కేస్తారు. చూశారా! నా వల్ల ఈ టైపు బెనిఫిట్సూ ఉన్నాయి కదూ!

ష్..రూలర్సుతో పోల్చకండే.. ప్లీజ్!

ఎలక్షన్స్ టైంలోనే లీడర్లు మీ ముందుకొస్తుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారు.మీరు తప్ప మాకిక మరెవ్వరూ లేరని తియ్యటి కబుర్లతో నమ్మిస్తుంటారు. ఇండ్లు కట్టిస్తామనీ, నౌకర్లలో కూచోబెడతామనీ, కొలువులులేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తా‘మనీ’ కొండవీటి చాంతాండంతటి టేస్టీ లిస్టు ఎనౌన్సు చేస్తారు.70 ఎంఎంకు మించిన తెరపై ఊహా లోకపు సినిమా చూపిస్తారు. మళ్లా ఐదేండ్ల దాకా పత్తా ఉండరు. అట్లాంటి పాలకులతో నన్ను పోల్చకండే ప్లీజ్! నేను కాలానుగుణంగా, నేచురల్‌గా నాలుగేళ్లలో మెరుపులా ఓ దినమొస్తూ శుభమస్తని దీవిస్తూ సెలవు తీసుకుంటాను. స్వచ్ఛమైన మనసు నాది. అదే రూలర్లు ఫైవ్ ఇయర్స్ అలానే నిక్షేపంగా ఉంటారు. వాళ్ల టైం బాగుండీ, రెన్యువలూ అవుతారు. మీ చెంతకు మాత్రం రారు!
ఫైనల్‌గా ఓ అలర్ట్! ఈ దినం లీడర్ల నుంచి పెద్దగా ప్రామిస్‌లు తీసుకోకండే. ‘..వచ్చే ఫిబ్రవరి 29 కల్లా అమలు చేస్తాం..’ అని అన్నా అంటారు. అంటే, నాలుగేళ్లు మీరు ఆగాలి.వాళ్లకేమో బేఫికర్‌గా రెస్ట్ అన్నమాట. అర్థమైంది కదా! వాళ్లు చాలా తెలివై‘నోళ్లు’. మీతో నా గుండెచపుడు వినిపిస్తుండగానే.. నాకున్న 24 హవర్స్ టైం ముగియవస్తున్నది బై బై. విష్ యూ ఏ ఆల్ ద బెస్ట్!

Tags:    

Similar News