సంక్షోభంలోనూ సంక్షేమం చేపడుతున్నాం : కేటీఆర్

దిశ, కరీంనగర్ : కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా సంక్షేమ పథకాల అమలును ఏ మాత్రం విస్మరించలేదని, వాటిని యధావిధిగా కొనసాగిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ పరిపాలనలో వారికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణాలో రైతు బంధు అమలు చేసిన […]

Update: 2020-06-23 04:53 GMT

దిశ, కరీంనగర్ :
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా సంక్షేమ పథకాల అమలును ఏ మాత్రం విస్మరించలేదని, వాటిని యధావిధిగా కొనసాగిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ పరిపాలనలో వారికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణాలో రైతు బంధు అమలు చేసిన తర్వాతే కేంద్రం కూడా రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. చైనా యుద్దంలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శంగా ఉందని, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కొనియాడారంటే రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో అర్థం చేసుకోవాలన్నారు. గొర్రెల పెంపకం విషయంలో కూడా కేంద్రం రాష్ట్రాన్ని అభినందించిందని, రాష్ట్రంలో వీటి సంఖ్య రెట్టింపయ్యిందని కేంద్రమే గుర్తించిందన్నారు. రానున్న రోజుల్లో వివిధ విప్లవాలు రానున్నాయని దీంతో రాష్ట్రం సుభిక్షంగా మారనుందని కేటీఆర్ తెలిపారు. అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి కారణం దక్షత ఉన్న కేసీఆర్ సీఎం కావడమేనని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News