హ‌న్మకొండ‌లో ఈవ ఐవీఎఫ్ సెంట‌ర్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హైదరాబాద్‌లో సక్సెస్ సాధించిన ‘ఈవ ఐవీఎఫ్’ ఇప్పుడు వరంగల్ నగరంలోనూ అడుగుపెట్టింది. సంతాన భాగ్యానికి నోచుకోని ఎంతో మంది దంపతుల మానసిక ఆవేదనకు ఇప్పుడు వరంగల్ నగరంలోనే చక్కటి పరిష్కారం లభించనున్నది. అలాంటి దంపతులకు సంపూర్ణమైన సంతాన సాఫల్య ( ఫెర్టిలిటీ ) సేవలందించేందుకు నగరం నడిబొడ్డున ‘ఈవ ఐవీఎఫ్’ (EVA–IVF) సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ టి.మోహన్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎంతో […]

Update: 2021-09-11 05:00 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హైదరాబాద్‌లో సక్సెస్ సాధించిన ‘ఈవ ఐవీఎఫ్’ ఇప్పుడు వరంగల్ నగరంలోనూ అడుగుపెట్టింది. సంతాన భాగ్యానికి నోచుకోని ఎంతో మంది దంపతుల మానసిక ఆవేదనకు ఇప్పుడు వరంగల్ నగరంలోనే చక్కటి పరిష్కారం లభించనున్నది. అలాంటి దంపతులకు సంపూర్ణమైన సంతాన సాఫల్య ( ఫెర్టిలిటీ ) సేవలందించేందుకు నగరం నడిబొడ్డున ‘ఈవ ఐవీఎఫ్’ (EVA–IVF) సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ టి.మోహన్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎంతో మంది ఫ్యూచర్ పేరెంట్స్‌ సంతాన స్వప్నాలకు మార్గం చూపిన ‘ఈవ ఐవీఎఫ్’ ఇప్పుడు వరంగల్ నగరానికీ వచ్చిందన్నారు. ఇకపైన వరంగల్ ప్రజలకు కూడా అటువంటి సేవలను అందించాలన్న లక్ష్యంతోనే నూతన కేంద్రాన్ని నెలకొల్పినట్లు తెలిపారు.

హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ రెండో అంతస్తులో ప్రారంభోత్సవం సందర్భంగా ‘ఈవ ఐవీఎఫ్ డైరెక్టర్లు డాక్టర్ ప్రశాంతి మోహన్, డాక్టర్ ఐశ్వర్య నుపూర్‌తో కలిసి మోహన్‌రావు విలేకరులతో పై వివరాలను వెల్లడించారు. ఫిజియోలాజికల్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, ఐసీఎస్ఐ లాంటి అధునాతన టెక్నిక్స్, ఐవీఎఫ్, ఐయూఐ, హిస్టెరోస్కోపీ, లాప్రోస్కోపీ, మేల్/ ఫిమేల్ ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ తదితర సేవలు ఫెర్టిలిటీ రంగంలో నిపుణులతో అందించనున్నట్లు తెలిపారు. పేషెంట్లకు వ్యక్తిగత శ్రద్ధతో సేవలను అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికి అనుగుణంగానే ఆధునికమైన మౌలిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఐవీఎఫ్ ల్యాబ్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మెడికల్ ప్రోటోకాల్ పాలసీ రూపొందించినట్లు తెలిపారు. రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీ, ఫెర్టిలిటీ సర్జరీ, ఎంబ్రియాలజీ, ఆండ్రాలజీ విభాగాల్లో విస్తృతమైన అనుభవం, ప్రావీణ్యం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో ఈవ ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటైనట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో అతి కొద్ది కాలంలోనే గుర్తింపు పొందిన ‘ఈవ ఐవీఎఫ్’ చాలామందికి సంతృప్తికరమైన సేవలందించిందని, వరంగల్ నగరంలోనూ అలాంటి సేవలనే అందించాలనే ఉద్దేశంతోనే హన్మకొండలో నూతన కేంద్రాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. తల్లిదండ్రులు కావాలని ఆకాంక్షించే దంపతులకు నిర్దిష్టమైన రక్షణ ప్రమాణాలతో, వైద్య మార్గదర్శకాలతో ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ అందించనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ధరలతో ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ కోరుకునేవారికి ఈవ ఐవీఎఫ్ సరైన వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవ ఐవీఎఫ్ డాక్టర్లు లహరి, అన్నపూర్ణ, సువర్ణ, ధనలక్ష్మి, రచన, పలువురు గైనకాలజిస్టులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News