4K టెక్నాలజీతో ఫ్రెంచ్ ఓపెన్ ప్రసారం..

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ (French open)ఈ ఏడాది కరోనా కారణంగా ఆలస్యం (delay) గా ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ క్లేకోర్ట్ టోర్నీ (Clay court tourny)లో టాప్ సీడ్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. కరోనా (Covid-19) కారణంగా ప్రేక్షకులు లేకుండానే (No audience) టోర్నీ నిర్వహిస్తుండటంతో టీవీల్లో చూసే వీక్షకుల కోసం బ్రాడ్‌కాస్టర్లు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ క్రీడ (Sport)ను కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ […]

Update: 2020-09-20 10:38 GMT

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ (French open)ఈ ఏడాది కరోనా కారణంగా ఆలస్యం (delay) గా ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ క్లేకోర్ట్ టోర్నీ (Clay court tourny)లో టాప్ సీడ్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. కరోనా (Covid-19) కారణంగా ప్రేక్షకులు లేకుండానే (No audience) టోర్నీ నిర్వహిస్తుండటంతో టీవీల్లో చూసే వీక్షకుల కోసం బ్రాడ్‌కాస్టర్లు వినూత్న ప్రయోగం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ క్రీడ (Sport)ను కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ టెక్నాలజీలో ప్రసారం చేయలేదు. తొలి సారిగా ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈ అధునాతన టెక్నాలజీ (4K Advanced technology) ఉపయోగించి ప్రసారం చేయాలని యూరోస్పోర్ట్ నిర్ణయించింది. ఈ టెక్నాలజీ వల్ల ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్లుగా అనుభూతి చెందుతారని బ్రాడ్‌కాస్టర్ తెలియజేస్తున్నది. సెంటర్ కోర్టులో జరిగే అన్ని మ్యాచ్‌లను జర్మన్ కామెంటరీతో యాడ్స్ లేకుండా ( Without adds) ప్రసారం చేయనున్నారు.

Tags:    

Similar News