సీఎం కేసీఆర్‌పై ఈట‌ల సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

దిశ ప్రతినిధి, వరంగల్: గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అసెంబ్లీలో త‌న‌ను అడుగుపెట్టనివ్వకుండా చేసేందుకు కేసీఆర్ త‌న సంప‌ద‌ను, అధికార యంత్రాంగాన్ని, త‌న అనుభ‌వాన్నంతా ఉప‌యోగించాడ‌ని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌లో భాగంగా శనివారం ఉదయం కమలపూర్ లో ఈటల రాజేందర్ తన సతీమణి జమునతో కలిసి ఓటు హ‌క్కును వినియోగించ‌కున్నారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆరు నెల‌ల సుదీర్ఘ ప్రచారం […]

Update: 2021-10-30 09:24 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అసెంబ్లీలో త‌న‌ను అడుగుపెట్టనివ్వకుండా చేసేందుకు కేసీఆర్ త‌న సంప‌ద‌ను, అధికార యంత్రాంగాన్ని, త‌న అనుభ‌వాన్నంతా ఉప‌యోగించాడ‌ని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌లో భాగంగా శనివారం ఉదయం కమలపూర్ లో ఈటల రాజేందర్ తన సతీమణి జమునతో కలిసి ఓటు హ‌క్కును వినియోగించ‌కున్నారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆరు నెల‌ల సుదీర్ఘ ప్రచారం త‌ర్వాత ఈరోజు హుజూరాబాద్ ఉప‌ పోలింగ్ జ‌రుగుతోందని అన్నారు. వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి, త‌న అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించారన్నారు. ఓటర్లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారని ఈట‌ల ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌నిషివై ఉంటే, ఓట‌రువై ఉంటే అధికార పార్టీకే ఓటు చేయాలంటూ ప్రజలకు హుకుం జారీ చేశార‌ని ఆరోపించారు. ఈ హుజూరాబాద్‌లో ఏం జ‌రుగుతుందో యావ‌త్‌తెలంగాణ ఉత్కంఠ‌గా ఎదురుచూసిందని అన్నారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు వాట‌న్నింటినీ దాటుకుని స్వచ్ఛందంగా ఓట్లు వేశారన్నారు. ధ‌ర్మం గెలుస్తుంది బిడ్డా.. నీ క‌ష్టం ఫ‌లిస్తది బిడ్డా.. అంటూ ప్రజలు దీవించార‌ని ఈట‌ల అన్నారు. ఇదే స‌మ‌యంలో పోలీసుల‌పై ఈట‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పోలీసులే స్వయంగా డ‌బ్బులు, మ‌ద్యం పంపిణీ చేశార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. చివ‌రికి పోలింగ్ రోజున కూడా అడ్డాలు పెట్టి డ‌బ్బులు పంచుతున్నార‌ని, ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది మాయ‌నిమచ్చ అని ఈట‌ల విమ‌ర్శించారు.

Tags:    

Similar News