టీఆర్ఎస్ కు సవాల్ విసిరిన ఈటల

దిశ ప్రతినిధి, కరీంనగర్: రికార్డు స్థాయిలో సభ్యులు ఉన్న ఆ నియోజకవర్గంలో కనీసం పార్టీ మెంబర్లు కూడా ఓట్లు వేయలేదా..? పార్టీతో మమేకమై ఉంటామని సభ్యత్వం తీసుకున్న వారు కూడా కారుకు హ్యాండ్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నాయి ఎన్నికల ఫలితాలు. పార్టీ సభ్యులు కూడా అనుకూలంగా లేరన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి రియాక్షన్ వ్యక్తం చేస్తుందోనన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి స్థానిక సంస్థల ప్రతినిధుల వరకూ శ్రమించినా […]

Update: 2021-11-05 06:11 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రికార్డు స్థాయిలో సభ్యులు ఉన్న ఆ నియోజకవర్గంలో కనీసం పార్టీ మెంబర్లు కూడా ఓట్లు వేయలేదా..? పార్టీతో మమేకమై ఉంటామని సభ్యత్వం తీసుకున్న వారు కూడా కారుకు హ్యాండ్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నాయి ఎన్నికల ఫలితాలు. పార్టీ సభ్యులు కూడా అనుకూలంగా లేరన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి రియాక్షన్ వ్యక్తం చేస్తుందోనన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి స్థానిక సంస్థల ప్రతినిధుల వరకూ శ్రమించినా ఓటమి రుచి చూపించిన హుజురాబాద్ నియోజకవర్గంపై పోస్టు మార్టం చేస్తుంటే ఒక్కో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు వచ్చిన ఓట్లు పార్టీ సభ్యత్వం సంఖ్య కన్నా తక్కువగా ఉండడం అధిష్టానం పెద్దలను అంతర్మథనంలో పడేసింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ కు ముందు జరిగిన సభ్యత్వ సేకరణలో హుజురాబాద్ నుంచి అత్యధికంగా లక్షా 5 వేల మంది మెంబర్ షిప్ తీసుకున్నారు. కానీ, గెల్లుకు 82,712 ఓట్లు మాత్రమే పోల్ కావడం గమానర్హం. ఈ లెక్కన 22,288 మంది పార్టీ సభ్యుల సంఖ్య కన్నా తక్కువగా రావడం పార్టీ అధిష్టానానికి మింగుడు పడకుండా తయరైందనే చెప్పాలి. ఐదున్నర నెలల పాటు అప్రతిహతంగా పార్టీలో చేరినవారు, ఈటల వెంట వెళ్లి తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరిన వారు వీరందరినీ లెక్కిస్తే లక్షల్లోనే సంఖ్య ఉంటుంది. వీరంతా టీఆర్ఎస్ పెద్దల మెప్పు కోసం మాత్రమే కండువాలు కప్పుకుని ఆ తరువాత హ్యాండ్ ఇచ్చారా అన్నదే పార్టీ పెద్దలను తొలిచి వేస్తున్న ప్రశ్న.

నాయకులు అటు… ప్రజలు ఇటు

కండువాలు కప్పించడం మంత్రుల చుట్టూ తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తూ హంగామా సృష్టించడం తప్ప ప్రజల్లోకి వెళ్లి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టు సమాచారం. మంత్రుల చుట్టూ నాయకులు చేరి హంగామా సృష్టిస్తూ సరికొత్త భ్రమల ప్రపంచం క్రియేట్ చేస్తే ప్రజలు మాత్రం ఈటలకు అనుకూలంగా ఓట్లేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ని తలపించే వాహన శ్రేణి ఊరూరా తిరిగినా సానుకూత రాకపోవడం వెనక ఆంతర్యం మాత్రం క్షేత్ర స్థాయిలో ఉన్న లీడర్ల తప్పిదమేనని తేలినట్టు తెలుస్తోంది. ఎంతమంది నాయకులు తమకు అనుకూలంగా ఉన్నారోనన్న అంచనాల్లో మునిగిన ముఖ్య నాయకులు అసలు వీరి వెనక ఎంతమంది ఓటర్లు ఉన్నారోనన్న విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోయారు. దీంతో నాయకులు గులాబీ కండువాల్లో గుబాళిస్తే ఈవీఎంలలో మాత్రం ఈటలకు ఓట్ల వర్షం పడినట్టు స్పష్టం అవుతోంది.

మంత్రులే లేకుంటే…

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపి ఇన్ చార్జ్ లను నియమించారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు కూడా బాధ్యతలు అప్పగించారు. వీరు కూడా లేకుండా పార్టీ అభ్యర్థికి ఓట్లు ఎన్ని వచ్చేవి అన్నది అంచనాలకు దొరకనంత లోతుల్లోనే ఉండేది. వాస్తవంగా ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత అక్కడి ప్రజల నాడిని గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని జీరో నుంచే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. వందలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. ఈ లెక్కన 2.36 లక్షల ఓటర్లలో మెజార్టీ సాధించేందుకు వారిలో సానుకూలతను పొందేందుకు ఐదున్నర నెలలు పట్టినా లాభం లేకుండా పోయింది. శతవిధాల ప్రయత్నించినా 82 వేల మంది ఓటర్లను మాత్రమే తనకు అనుకూలంగా మల్చుకోగలిగింది. ఇది కూడా మంత్రులు సొంత నెట్ వర్క్ వల్లనే అన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది.

TRS ట్రబుల్ షూటర్ స్ట్రగుల్ షూటర్ అయ్యారా?..రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారిన హరీష్ రావు చరిష్మా…వరుసగా మంత్రి వ్యూహాలు ప్లాప్ వెనుక ఆ నేతల హస్తం??

Tags:    

Similar News