ప్రతి మెడికల్ కాలేజీకి నోడల్ ఆఫీసర్: ఈటెల
కరోనా బాధితులకు చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే ముందు ఉందని మంత్రి ఈటల అన్నారు. పదివేల బెడ్లను కరోనా పాజిటివ్ కేసుల చికిత్స కోసం సిద్ధం చేశామన్నారు. 700 ఐసీయూ, 190 వెంటిలేటర్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. 26 రోజుల్లో 47 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. “మొదటి ఫేజ్‌లో ప్రభుత్వ ఆసుపత్రులు, రెండో పేజ్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నుసంధానంగా ఉన్న హాస్పిటల్సను వినియోగిస్తాం. మూడో […]
కరోనా బాధితులకు చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే ముందు ఉందని మంత్రి ఈటల అన్నారు. పదివేల బెడ్లను కరోనా పాజిటివ్ కేసుల చికిత్స కోసం సిద్ధం చేశామన్నారు. 700 ఐసీయూ, 190 వెంటిలేటర్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. 26 రోజుల్లో 47 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. “మొదటి ఫేజ్‌లో ప్రభుత్వ ఆసుపత్రులు, రెండో పేజ్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నుసంధానంగా ఉన్న హాస్పిటల్సను వినియోగిస్తాం. మూడో ఫేజ్‌లో జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ హస్పిటల్స్ ను వినియోగిస్తాం”. అని మంత్రి తెలిపారు. ఈ మేరకు శనివారం కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ జరిగిన సమావేశంలో మెడికల్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ కు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ప్రభుత్వమే అందిస్తుంది. స్టాఫ్ కు అవసరమైన పాసులు, రవాణా సదుపాయం, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రతి మెడికల్ కాలేజ్ కు ఒక నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లలర్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Tags: minister etela, meeting, medical collages reprasentives