మంత్రి హరీష్ రావు ఇంట్లో వాళ్ల ఓటు కూడా నాకే : ఈటల

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో జరిగిన కుల సమ్మేళనంలో మాజీ మంత్రి ఈటల మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నిక ఒక సీటు కోసం కాదని, ఈటల గెలిస్తే అనేక మంది ఈటల రాజేందర్‌లు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు కేసీఆర్ రూ. 192 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. […]

Update: 2021-08-11 08:43 GMT

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో జరిగిన కుల సమ్మేళనంలో మాజీ మంత్రి ఈటల మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నిక ఒక సీటు కోసం కాదని, ఈటల గెలిస్తే అనేక మంది ఈటల రాజేందర్‌లు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు కేసీఆర్ రూ. 192 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజలు ఏది అడిగితే అది ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించాడని.. అందుకే నియోజకవర్గంలో ఐదుగురు మంత్రులు, పదికి పైగా ఎమ్మెల్యేలను పంపించాడన్నారు.

హుజూరాబాద్‌లో బీజేపీ నాయకుల పైనే కాదు. టీఅర్ఎస్ ఇన్ఛార్జీలపైన కూడా కేసీఆర్ నిఘా పెట్టాడన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇన్ఛార్జిలతో సంబంధాలు ఉన్నా మాట వాస్తవమేనన్నారు. మంత్రి హరీష్ రావు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా తనకే ఓటు వేస్తుందని ఈటల జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో గత మూడు నెలలు నుండి దసరా పండుగ నడుస్తుందని విమర్శించారు. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదని ప్రజలు నిరూపిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద నిఘా ఉందని, ఎమ్మెల్యేలను కూడా నమ్మకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్సీనా, బీసీనా కాదు.. కేసీఆర్‌కు ఒక బానిస కావాలన్నారు. తన రాజీనామా వల్ల ఏడు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా జరుగుతున్నాయన్నారు.

ఇది ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా జరగాలన్నారు. దుబ్బాకలో బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగలేదని, హుజూరాబాద్‌లో కూడా ఆగవన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పార్టీలు ముఖ్యం కాదని, ఈటల రాజేందర్ ముఖ్యమన్నారు. తను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు గెలిచినట్టేనని, ఓడిపోతే మనం ఓడిపొయినట్టన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు అందే బాపన్న బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News