ఖమ్మంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఖమ్మం పట్టణంలో డిసిన్ఫెక్షన్ టన్నెళ్లను ఏర్పాటు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో వీటిని మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తోంది. ఖమ్మం పెవిలియన్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టన్నెల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ టన్నెల్ నుంచి వెళ్లడం ద్వారా క్రిమిసంహారక ద్రావణం తుంపర్ల మాదిరిగా మనమీద పడుతుంది. దీనివల్ల శరీరంపై ఉన్న వైరస్‌లు చనిపోతాయని, ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా తోడ్పడతాయని వైద్యులు […]
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఖమ్మం పట్టణంలో డిసిన్ఫెక్షన్ టన్నెళ్లను ఏర్పాటు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో వీటిని మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తోంది. ఖమ్మం పెవిలియన్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టన్నెల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ టన్నెల్ నుంచి వెళ్లడం ద్వారా క్రిమిసంహారక ద్రావణం తుంపర్ల మాదిరిగా మనమీద పడుతుంది. దీనివల్ల శరీరంపై ఉన్న వైరస్‌లు చనిపోతాయని, ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
Tags : Establishment, Disinfection, Tunnel, Khammam, municiple, corona