పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్లమెంట్ జీరో అవర్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో ఉన్న లక్ష టన్నుల పసుపు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని […]
దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్లమెంట్ జీరో అవర్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో ఉన్న లక్ష టన్నుల పసుపు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక నిర్దిష్ట హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. కానీ నేటీకి అది అమలుకు నోచుకోలేదన్నారు. క్వింటాల్‌కు పసుపుకు రూ.10,000 కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన తెలిపారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 80 శాతం వాటాతో భారత్ నెంబర్ 1గా కొనసాగుతోందని కొనియాడారు. కాగా, మన దేశంలోని 28రాష్ట్రాల్లో పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని 1.33 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 2.81 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. పసుపు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయని చెప్పుకొచ్చారు.
tags ; turmeric board, production in india world no.1, mp uttam kumar, telangana no.1 in india